అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రామజన్మభూమిలో కోదండ పాణి దివ్యమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. పండగ వాతావరణంలో ఈ మహాక్రతువును నిర్వహించారు. అయోధ్యలో హనుమాన్ ఆలయం నుంచి రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ.. తొలుత ప్రత్యేక పూజలుచేశారు. ప్రత్యేకంగా అలంకరించిన సీతారామలక్ష్మణ విగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. రామ్‌లల్లాకు హారతి ఇచ్చారు. అనంతరం ప్రదక్షిణ చేసి హుండీలో దక్షిణ వేశారు మోదీ. అదే ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటి నీళ్లు పోశారు.
వేదపఠనం, మంత్రోచ్ఛరణల మధ్య.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్నంలో వెండి ఇటుకలతో ఆలయానికి శంకుస్థాపన చేశారు మోదీ. 1989 నుంచి ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు మందిర నిర్మాణానికి పంపిన 2 లక్షల 75 వేల ఇటుకల్లో జై శ్రీరామ్ అని రాసిన వంద ఇటుకలను భూమిపూజ కోసం ఎంపిక చేశారు. వాటిలో 9 ఇటుకలను పునాదిరాయి కోసం వినియోగించినట్లు పూజారులు తెలిపారు.
11 పవిత్ర ప్రదేశాల నుంచి మట్టి