మహారాష్ట్ర భివండీలోని మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. ఈ విషయాన్ని జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్డీఆర్ఎఫ్) ధ్రువీకరించింది.
భివండీ భవన ప్రమాదంలో 41కి చేరిన మృతులు - భీవండీ భవన ప్రమాదంలో 41 మంది మరణం
మహారాష్ట్ర భివండీలో జరిగిన భవన ప్రమాద ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. ఇప్పటివరకు 25 మందిని కాపాడినట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది.
![భివండీ భవన ప్రమాదంలో 41కి చేరిన మృతులు Bhiwandi building collapse update- Death toll rises to 41](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8916052-239-8916052-1600919059541.jpg)
భివండీ భవన ప్రమాదంలో 41కి చేరిన మృతులు
ఇప్పటివరకు మొత్తం 25 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.
సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భివండీ పట్టణంలో శిథిలావస్థకు చేరిన పాత భవనం ఒకటి కూలిపోయింది. ఇది 43 ఏళ్లనాటిదని తెలుస్తోంది. భవనం యజమానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక అధికారుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.