మహారాష్ట్ర భివండీలోని మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భవన శిథిలాల కింద రాత్రి నుంచి 20కిపైగా మృతదేహాలను వెలకితీశారు. మొత్తం ఘటనలో మరణించిన వారి సంఖ్య 39కు చేరింది.
భవనం కూలిన ఘటనలో 39కు చేరిన మృతులు
మహారాష్ట్ర భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 39కు చేరింది. మంగళవారం రాత్రి నుంచి 20కిపైగా మృతదేహాలను వెలికితీశారు అధికారులు.
మహారాష్ట్ర భివండీ
వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 25 మందిని రక్షించారు సహాయక సిబ్బంది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.
సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భివండీ పట్టణంలో పాత భవనం ఒకటి కూలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది 43 ఏళ్లనాటిదని, ఆ భవనం యజమానిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక అధికారుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Last Updated : Sep 23, 2020, 10:54 AM IST