సకల మానవాళికి స్ఫూర్తిని బోధించిన గొప్ప వ్యక్తులు ఆచార్య వినోబా భావే, స్వామి వివేకానంద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వినోబా భావే జయంతి, వివేకానందుడు అమెరికాలోని చికాగోలో 1893లో ఇదే రోజు ప్రసంగం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని వారికి మోదీ నివాళి అర్పించారు.
'వినోబా భావే, వివేకానందుడు నేర్పిన పాఠాలెన్నో' - Modi
ఆచార్య వినోబా భావే,స్వామి వివేకానందల నుంచి మానవాళి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వినోబా భావే జయంతి, సహా చికాగోలో వివేకానందుడు ప్రసంగించిన రోజును పురస్కరించుకుని వారికి నివాళులర్పించారు.
2001లో ఇదే రోజు అమెరికాలోని డబ్ల్యూటీఓ టవర్లపై ఉగ్రదాడిని గుర్తు చేసుకున్నారు మోదీ. వినోబా భావే జై జగత్ నినాదం, వివేకానందుడు ప్రవచించిన విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే మార్గంలో పయనిస్తే ఆ నాటి విధ్వంసం జరిగి ఉండేది కాదని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కూడా వినోబా భావేను ఎంతో గొప్పగా ప్రశంసించారన్నారు. యువత వివేకానందుడి చికాగో ప్రసంగాన్ని చదవాలని సూచించారు. వినోబా, వివేకానందుడు జీవితాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఇదీ చూడండి: 'ప్రపంచ అవసరాలకు తగ్గ నిపుణుల తయారీ'