కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దిల్లీలో నిర్వహించాలని తలపెట్టిన ‘భారత్ బచావో’ ర్యాలీని వాయిదా వేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. నవంబరు 30న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీ వాయిదా - భారత్ బచావో ర్యాలీ
భారత్ బచావో ర్యాలీని వచ్చే నెల 14కు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. ఈ నెల 30న దిల్లీలోని రామ్లీల మైదానంలో జరగాల్సిన ఈ ర్యాలీని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.

కాంగ్రెస్: భారత్ బచావో ర్యాలీ వాయిదా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, శాసనసభాపక్షనేతలు, అనుబంధ సంస్థల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. డిసెంబరు 14వ తేదీ ఉదయం 11 గంటలకు దిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Last Updated : Nov 21, 2019, 8:09 AM IST