తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మలేషియా ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్​

పౌరసత్వ చట్టంపై మలేషియా ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది.

Bharat condemned Maleshiya PM reaction on CAA
మలేషియా ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన భారత

By

Published : Dec 21, 2019, 10:41 PM IST

పౌరసత్వ సవరణ చట్టంపై మలేషియా ప్రధాని మహాతిర్‌ మహమ్మద్‌ వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. మహాతిర్‌ వ్యాఖ్యలు అవాస్తవమని, విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా... ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది.

కౌలాలంపూర్‌లో ఓ మీడియా సమావేశం వేదికగా భారత్​పై విమర్శలు చేశారు మహాతిర్. లౌకిక దేశంగా చెప్పుకునే భారత్‌ ముస్లింల పౌరసత్వం తొలగించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పబట్టిన భారత విదేశీ వ్యవహారాల శాఖ... తమ పౌరులపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపించబోదని వివరించింది. వాస్తవాలు తెలుసుకోకుండా భారత అంతర్గత వ్యవహారాల్లో మలేషియా స్పందించకపోవడమే మంచిదని సూచించింది.

దీచూడండి: 'ఆందోళనల నుంచి దృష్టి మళ్లింపునకే సరిహద్దుపై చర్చ'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details