దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న భారత్ బయోటెక్.. జులై 15 నుంచే మానవులపై టీకా ప్రయోగాలు మొదలు పెట్టినట్లు ప్రకటించింది. హరియాణాలోని రోహ్తక్ పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో శుక్రవారం.. కొవాగ్జిన్ ప్రయోగాలు జరిపినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ముగ్గురిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.. వీరందరిపై వైరస్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని తెలిపారు.
"ఈరోజు పీజీఐ రోహ్తక్లో మానవులపై భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ముగ్గురు వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. వీరందరూ వ్యాక్సిన్ను బాగా తట్టుకున్నారు. వీరిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేవు."