భారత స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల 88వ వర్ధంతి సందర్భంగాపాకిస్థాన్లోని లాహోర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని లాహోర్ కేంద్రంగా ఉన్న భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ నిర్వహించింది.
ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ముగ్గురు యోధుల త్యాగాలను, పోరాట పటిమను గుర్తుచేసుకున్నారు అక్కడి అభిమానులు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.