తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: తేజస్విని కాదు తేజస్వి..! - తేజస్వి సూర్య

బెంగళూరు దక్షిణం... కర్ణాటకలో కీలకమైన లోక్​సభ నియోజకవర్గాల్లో ఒకటి. భాజపాకు కుంచుకోట. దివంగత కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్​ ఆరు సార్లు గెలిచిందిక్కడే. ఆయన తర్వాత అవకాశం ఎవరికి అనేది మొన్నటి వరకు ఆసక్తికరాంశం. అనంతకుమార్​ భార్య బరిలో ఉంటారని అందరూ ఊహించారు. ఇంతలో భాజపా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదేంటి?

భారత్​ భేరి: తేజస్విని కాదు తేజస్వి..!

By

Published : Mar 27, 2019, 7:51 PM IST

భారత్​ భేరి: తేజస్విని కాదు తేజస్వి..!

తేజస్విని... కేంద్ర మాజీ మంత్రి అనంత్​ కుమార్​ భార్య. సామాజిక సేవతో బెంగళూరు వాసుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2018 నవంబర్​లో అనంత్​ కుమార్​ మరణాంతరం... రాజకీయాలవైపు చూశారామె. అనంత్ కుమార్​ గతంలో 6సార్లు గెలిచిన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం టికెట్​ తేజస్వినికి దక్కవచ్చని అంతా భావించారు. అదే ధీమాతో నియోజకవర్గంలో ప్రచారమూ చేశారామె.

నామినేషన్​ దాఖలుకు కొద్దిగంటల్లో గడువు ముగియడానికి ముందు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది భాజపా. అందులో తేజస్వినికి బదులు తేజస్వి పేరుంది.

పేరు ప్రకటనలో పొరబాటు జరగలేదు. అభ్యర్థి విషయంలో మార్పు జరిగింది. అనంత్ కుమార్​ సతీమణి తేజస్వినికి బదులు.... 28ఏళ్ల యువనేత తేజస్వి సూర్యను పోటీకి దించింది భాజపా. అయినా... పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు తేజస్విని.

ఇది నా మద్దతుదారులకు, నాకు షాక్​​ లాంటింది. పార్టీ విభన్నమైనదిని చూపించటానికి ఇదే సమయమని వాళ్లతో పాటు నాతో నేను కూడా ఎప్పటినుంచో చెప్పుకుంటున్నా. అనంత కుమార్​ జీవితాన్ని చూస్తే... ఆయన ఆలోచనలు, దేశం కోసం పనిచేసిన తీరు, పార్టీ కోసం పనిచేసిన తీరు అర్థమవుతుంది. సిద్ధాంతాలను తెలియజేయటానికి, ఎందుకు మనం ప్రత్యేకమైన వాళ్లమో తెలియజేయటానికి ఇదే సరైన సమయమనేది నా అభిప్రాయం. కార్యకర్తలంతా ఒప్పుకున్నారు.
- తేజస్విని​, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్​ సతీమణి

ఒకప్పటీ ఏబీవీపీ కార్యకర్త సూర్య. ..

చిన్నప్పటి నుంచి సూర్య అఖిల భారత విద్యార్థి పరిషత్​లో పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం పార్టీ సామాజిక మాధ్యమ ప్రచార కమిటీలో సభ్యుడు, యువమోర్చా ప్రధాన కార్యదర్శి.
పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి సూర్య కృతజ్ఞతలు తెలియజేశారు. తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. అంతే కాదు తేజస్విని గారి నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు తెలిపారు.

తేజస్విని నాకు తల్లి లాంటి వారు. ఏ విధంగా పెరిగానో చూశారు. అనంతకుమార్​ తప్పొప్పులు చెప్పుతూ... నన్ను ఈరోజు ఉన్న విధంగా తయారు చేశారు. ఆయన నాకు గుర్తింపునిచ్చారు. ఇది భాజపా నాయకత్వంలో ఉన్న లక్షణం. తేజస్విని వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నా. మనస్ఫూర్తిగా దీవించారు. టికెట్​ వస్తుందని అనుకుంటున్న మద్దతుదారులకూ దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్ణయమే అంతిమమని, దానిని అందరూ గౌరవించాలని చెప్పారు.
- తేజస్వి సూర్య, బెంగళూరు దక్షిణ నియోజకవర్గ భాజపా అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details