బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటు దారులకు బంగాల్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. జై శ్రీరామ్ అని నినదించినందుకు భాజపా కార్యకర్తల పట్ల మమత వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు సుశీల్. ఈ విషయంపై మమతను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
" జై శ్రీరామ్ అని నినదించిన వారి పట్ల మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూస్తే బంగాల్లో ఉన్న హిందీ మాట్లాడే వారిని ఆ రాష్ట్రం నుంచి బయటికి పంపాలని కుట్ర చేస్తున్నారనిపిస్తోంది. పశ్చిమ బంగాల్ ప్రజలకు జై శ్రీరామ్ అని నినదించే హక్కు లేదా?, ఇతర భాషలు మాట్లాడే వారికి బంగాల్లో నివసించే వీలు ఉండకూడదా?. ఈ విషయాలపై మమత వివరణ ఇవ్వాలి "
-సుశీల్ మోదీ.