తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేజ్రీవాల్ మీకు అభినందనలు: మోదీ - అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

దిల్లీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్​ కేజ్రీవాల్​కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతగా రీట్వీట్​ చేశారు ఆప్​ అధినేత. దిల్లీని ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసేందుకు కలిసి పని చేద్దామని కోరారు.

best-wishes-to-kejriwal-for-a-fruitful-tenure-pm-modi
కేజ్రీవాల్ మీకు అభినందనలు: మోదీ

By

Published : Feb 16, 2020, 10:49 PM IST

Updated : Mar 1, 2020, 1:59 PM IST

అరవింద్​ కేజ్రీవాల్​.. దిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

మోదీ ట్వీట్​

"ఈ రోజు దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్​కు నా అభినందనలు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలని కోరుకుంటున్నా."

- నరేంద్రమోదీ, ప్రధాని ట్వీట్​.

తన సొంత నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో ఉన్న మోదీ.. కేజ్రీవాల్​కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విధంగా ట్వీట్​ చేశారు. ప్రధాని ట్వీట్​కు స్పందించారు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​.

కేజ్రీవాల్​ రీట్వీట్​

''నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ రోజు కార్యక్రమానికి వస్తారని భావించాను, కానీ మీ పనివల్ల రాలేకపోయారని అర్థం చేసుకున్నా. దిల్లీని భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచేలా చేసేందుకు మనం కలిసి పనిచేద్దాం.''

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

ఈ రోజు దిల్లీ రాంలీలా మైదానంలో కేజ్రీవాల్​తో పాటు ఆప్​ ఎమ్మెల్యేలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్​, ఖైలాశ్, గహ్లూత్, ఇమ్రాన్ హుస్సేన్​, రాజేంద్ర గౌతమ్​ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదీ చూడండి:ఏకే 3.0: దిల్లీ సీఎంగా కేజ్రీవాల్​ ప్రమాణ స్వీకారం

Last Updated : Mar 1, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details