సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తోన్న నగదు, బంగారం, వెండి, మాదకద్రవ్యాలు, మద్యం భారీస్థాయిలో పట్టుబడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.509 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రూ.181 కోట్ల విలువైన మద్యం, రూ.718 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఓటర్లను ప్రలోభపరిచేందుకు పంపిణీ చేయాలనుకున్న రూ. 418 కోట్లు విలువ చేసే బంగారం, వెండి వస్తువులను ఎన్నికల అధికారులు గుర్తించారు.
ఈ తనిఖీల్లో అగ్రస్థానంలో నిలిచిందిగుజరాత్. ఇక్కడ అత్యధికంగా మాదకద్రవ్యాలు దొరికాయి. వీటి విలువ రూ.500 కోట్లు ఉండవచ్చని అధికారుల అంచనా.
తమిళనాడు రెండోస్థానంలో ఉంది. రూ.401.46 కోట్లు విలువ చేసే మద్యం, మాదకద్రవ్యాలను పట్టుకున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 116 కోట్ల నగదు, 100 కేజీలకు పైగా బంగారం, 300 కేజీల వెండి కలిపి మొత్తం విలువ రూ.190 కోట్లుగా తేలి మూడో స్థానంలో ఉంది.