తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్యులకు, వైరస్​కు మధ్య అడ్డు 'పెట్టె'

కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రక్షణ కల్పించేందుకు 'ఏరోసోల్​ పెట్టె' అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బెర్హంపూర్​ ఐటీఐ దీనికి రూప కల్పన చేసింది.

By

Published : Apr 29, 2020, 12:35 PM IST

Berhampur ITI creates aerosol box to protect doctors treating Covid-19 cases
డాక్టర్లకు వైరస్​కు మధ్య అడ్డు 'పెట్టె'

కరోనాపై సాగుతున్న పోరులో ప్రాణాలను లెక్కచేయకుండా పని చేస్తున్నారు వైద్యులు. వైరస్‌ పొంచి ఉన్న ప్రమాదకర పరిస్థితుల్లో వారికి రక్షణ కల్పించేందుకు ‘ఏరోసోల్‌ పెట్టె’ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బెర్హంపూర్‌ ఐటీఐ దీన్ని రూపొందించింది. కరోనా సోకిన రోగి ఆరోగ్యం విషమిస్తే కృత్రిమ శ్వాసను అందించేందుకు నోరు, ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వాయు గొట్టాలను వైద్యులు అమర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రోగికి చాలా దగ్గరగా ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు.

అతని నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైద్యులకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సమస్యకు ఏరోసోల్‌ పెట్టె పరిష్కారాన్ని చూపుతుంది. పారదర్శక ప్లాస్టిక్‌తో తయారైన ఈ పెట్టెను రోగి తల చుట్టూ అమర్చుతారు. దానికి రెండు వైపులా చేతులు పట్టేంత రంధ్రాలు ఉంటాయి. వైద్యులు వాటిలోకి చేతుల్ని పోనిచ్చి రోగికి గొట్టాలు అమర్చడంతో పాటు ఇతరత్రా వైద్య చికిత్సలు అందిస్తారు. ఒక్కో దాని తయారీకి ధర రూ.3 వేలు వ్యయం అయినట్లు ఐటీఐ ప్రధాన అధ్యాపకుడు రజత్‌కుమార్‌ పాణిగ్రాహి చెప్పారు.

  • గువాహటిలోని ఐఐటీ విద్యార్థులు ఇంచుమించు ఇలాంటి ఏరోసోల్‌ పెట్టెనే రూపొందించారు. ఎయిమ్స్‌ వైద్యుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్నాక డిజైన్‌కు మార్పులు చేసి పెట్టెల ఉత్పత్తికి శ్రీకారం చుడతామని సంచిత్‌ ఝన్‌ఝన్‌వాలా అనే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details