కర్ణాటక బెంగళూరు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మాజీ మేయర్ సంపత్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కరోనాతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన... కొందరి సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
సంపత్ తప్పించుకోవడానికి సహకరించిన రియాజుద్దీన్ సహా మరో కాంగ్రెస్ కార్పోరేటర్ అబ్దుల్ రాకీబ్ జాకీర్‌ను కూడా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. సంపత్‌కు మైసూర్‌లోని నాగరహోళిలో జాకీర్ ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. జాకీర్‌కు కూడా బెంగళూరు అల్లర్లతో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.