కరోనా వైరస్‌ను తటస్థీకరించే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది బెంగళూరుకు చెందిన డీ స్కేలిన్ సంస్థలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (సీఏఆర్డీ). అయితే ఈ 'షైకకాన్'(స్కేలిన్ హైపర్‌చార్జ్ కరోనా కానాన్) పరికరం.. ఏ బ్యాక్టీరియాను, ఫంగస్‌ను చంపదని, కానీ కరోనా వైరస్ కణాలను మాత్రం న్యూట్రలైజ్ చేస్తుందని డీ స్కేలిన్ ఛైర్మన్ డా. రాజా విజయ్ కుమార్ తెలిపారు.
"ఈ పరికరానికి సంబంధించి భద్రత, సమర్థతపై పరీక్షలు జరిగాయి. త్వరలోనే దీనిని తయారు చేసి.. యూఎస్ఎఫ్డీఏ కింద అమెరికాకు, అనంతరం ఐరోపాకు మార్కెట్ చేస్తాం."