తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన- యువకుడు అరెస్టు - బెంగళూరు క్రైమ్​ వార్తలు

ఒంటరిగా వెళ్తున్న మహిళ పట్ల ఓ కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేయబోయిన సంఘటన బెంగళూరులో జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దుండగుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

amorous
మహిళ పట్ల కామాంధుడి అసభ్య ప్రవర్తన

By

Published : Oct 28, 2020, 12:24 PM IST

ఒంటరిగా వెళ్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

మహిళ పట్ల యువకుడి అసభ్య ప్రవర్తన

డీజే హళ్లిలోని మోదీ గార్డెన్​ సమీపంలో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒంటరిగా వస్తోన్న మహిళను గమనించిన దుండగుడు.. ప్యాంటు విప్పుకుని ఆమెను అడ్డుకున్నాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేయబోయాడు. సదరు మహిళ చెప్పుతో కొడతానని బెదిరిస్తున్నా వినకుండా అలాగే దాడి చేశాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించటం వల్ల అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. ఆ తర్వాత కొద్ది సమయంలోని దుండగుడిని జేపీ నగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు దత్తు అలియాస్​ చోటుగా గుర్తించారు.

ఇదీ చూడండి: మైనర్​ బాలికపై వీఆర్​ఏ అత్యాచారం.. కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details