బంగాల్లోని నదియాకు చెందిన ఓ యువతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా చిన్న చిన్న అగ్గిపుల్లలతో తాజ్‌మహల్‌ను రూపొందించి ఔరా అనిపిస్తోంది సహేలీ పాల్. ఇందుకోసం ఆమె సుమారు 3 లక్షల పుల్లలను వినియోగించిందట. కేవలం రెండు నెలల్లోపే ఈ నమూనాను పూర్తిచేసింది సహేలీ.
6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగిన ఈ తాజ్‌మహల్ తయారీకి రెండు రకాల పుల్లలను ఉపయోగించింది సహేలీ. రాత్రి పూట కూడా మెరిసే విధంగా అందంగా తీర్చిదిద్దింది.
గతంలో 1లక్షా 36వేల అగ్గిపుల్లలతో యునెస్కో నమూనాను రూపొందించి.. ఇరాన్ వాసి మెయ్సమ్ రహ్మానీ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంగా ఈ నమూనా తయారుచేసినట్టు చెప్పింది సహేలీ.