నరేంద్ర మోదీ లాంటి కనీస ప్రమాణాలు పాటించని ప్రధానిని ఇప్పటి వరకు చూడలేదని మండిపడ్డారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. మిఠాయిలు, కుర్తాలు పంపిన విషయాలను కూడా మోదీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బంగాల్లో రానీగంజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మమత. ఈ సందర్భంగా మోదీపై ధ్వజమెత్తారు.
మోదీకి మట్టి రసగుల్లలు పంపుతాం: మమత - MAMATa
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈసారి బంగాల్ నుంచి మట్టితో చేసిన రసగుల్ల మిఠాయిలు పంపుతామని వ్యంగాస్త్రాలు సంధించారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. దీదీ తనకు మిఠాయిలు, కుర్తాలు పంపుతారని మోదీ ఇటీవలే తెలిపారు. ఆ విషయంపై రానీగంజ్ ఎన్నికల ర్యాలీలో స్పందించారు మమత బెనర్జీ.
మోదీకి మట్టి రసగుల్లలు పంపుతాం: మమత
"బంగాల్ నుంచి రసగుల్లలు పంపుతారని మోదీ చెబుతున్నారు. ఈ సారి ప్రత్యేకంగా మట్టితో చేసిన రసగుల్లలు పంపుతాం. లడ్డులో కాజు, బాదం ఉన్నట్లుగా వీటిలో రాళ్లుంటాయి. అవి తింటే ఆయన పళ్లు విరుగుతాయి."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: తండ్రి కాంగ్రెస్కు.... తనయుడు భాజపాకు....!