తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లోనే అత్యధిక కరోనా మరణాల రేటు! - Bengal has highest COVID-19 mortality rate

దేశవ్యాప్తంగా బంగాల్​లోనే అత్యధిక కరోనా మరణాలు రేటు నమోదైనట్లు తెలిపింది అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు ఐఎంసీటీ సారథి అపూర్వ చంద్ర.

Bengal has highest COVID-19 mortality rate, central team tells chief secy
దేశవ్యాప్తంగా బంగాల్​లోనే అత్యధిక కరోనా మరణాల రేటు!

By

Published : May 4, 2020, 4:04 PM IST

బంగాల్​లో కరోనా మరణాల రేటుపై కీలక ప్రకటన చేసింది ఆ రాష్ట్రంలో పర్యటించిన అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం(ఐఎంసీటీ). దేశంలోనే అత్యధిక కొవిడ్​-19 మరణాలు రేటు బంగాల్​లో నమోదైనట్లు తెలిపింది. ఐఎంసీటీకి నేతృత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర.. బంగాల్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు ఈమేరకు రేఖ రాశారు.

" రాష్ట్రంలో ఎక్కువ మరణాలు సంభవిస్తుండటం.. పేలవ పర్యవేక్షణతో పాటు తక్కువ పరీక్షలు చేస్తున్నారనేందుకు నిదర్శనం. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే.. హెల్త్​ బులిటెన్లు, కేంద్రానికి ప్రభుత్వానికి నివేదించే లెక్కల్లో వ్యత్యాసం ఉంది."

- అపూర్వ చంద్ర, ఐఎంసీటీ సారథి

దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని గుర్తించడం, క్వారంటైన్‌కు తరలించడం సహా బంగాల్​ ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను సేకరిస్తోంది ఐసీఎంటీ బృందం. రెండు వారాలపాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన అనంతరం సోమవారం దిల్లీకి పయనమయ్యే ముందుగా.. సీఎస్​కు ఈ లేఖ రాశారు అపూర్వ.

ఐసీఎంటీ X బంగాల్​ సర్కార్​

ఐసీఎంటీ బృందానికి, బంగాల్​ ప్రభుత్వానికి మధ్య ఇదివరకే పలు వాగ్వాదాలు జరిగాయి. కరోనాపై ప్రభుత్వం సమాచారం అడిగినా ఇవ్వడం లేదని, లాజిస్టిక్స్‌ సహాయం చేయడం లేదని ఆరోపించారు అపూర్వ. ప్రభుత్వానికి ఎన్ని రేఖలు రాసినా.. స్పందించడం లేదని విమర్శించారు.

టీఎంసీ తీవ్ర విమర్శలు

బంగాల్‌ ప్రభుత్వం కేంద్ర బృందాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఐఎంసీటీ బృందాలు రాష్ట్రంలో రాజకీయ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించింది. వీటిని 'అత్యంత విచక్షణారహిత బృందాలు'గా వర్ణించింది.

ఇదీ చూడండి : ప్రయోగదశలో 12 కరోనా వ్యాక్సిన్లు- ఫలితం మాత్రం?

ABOUT THE AUTHOR

...view details