బంగాల్లోని జల్పాయ్గుడిలో మానవమృగాలు రెచ్చిపోయారు. ఓ పదహారేళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి పాశవికంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ ఇంటిలోని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు.
ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి 8 రోజుల పోలీసు కస్టడీని విధించింది న్యాయస్థానం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని రాజ్గంజ్కు చెందిన మైనర్ బాలిక.. ఆగస్టు 10 నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా బాలికను ఆగస్టు 15న అత్యాచారం చేసి చంపేసినట్లు అంగీకరించారు.