2016 సంవత్సరంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ఉన్న కె. బసవరాజా అనే అధికారి మొదటగా నాలుగు పావురాళ్లను తీసుకొచ్చి ఆఫీసులో సాకడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వాటి సంఖ్య 16కు చేరింది. బసవరాజా సండూర్ నుంచి కుందేళ్లనూ తెచ్చారు. వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఆహ్లాదం పంచే ఈ 'పోస్టాఫీస్' మీకు తెలుసా! - bellari
పచ్చని ప్రకృతిలో... పక్షుల కిలకిలారావాలు... కుందేళ్ల గంతులు... వింటుంటే ఏదో అడవి గురించో.. అక్కడి జీవజాలం గురించో చెప్తున్నారని అనుకుంటున్నారా... ? కానేకాదు ఇది ఓ పోస్టాఫీసు. ఇక్కడ ప్రత్యేకతలు చూసేయండి మరి.
ఆహ్లాదం పంచే ఈ 'పోస్టాఫీస్' మీకు తెలుసా!
ఆఫీస్ ప్రారంభమవగానే కపోతాలు గూళ్లను విడిచి ఎగిరిపోతాయి. బయటి ఆవరణంలో గింజల్ని తింటూ ఉంటాయి. ఆఫీసు ముగిసే సమయానికి తిరిగి గూళ్లకు చేరుకుంటాయి. వాటి ఆలనా పాలనా పోస్టాఫీస్ ఉద్యోగి కృష్ణమూర్తి చూస్తూ ఉంటారు.
కన్నపిల్లల్ని చూడగానే ముఖంలోని అలసట అంతా ఎలా మాయమవుతుందో పావురాళ్లు, కుందేళ్లని చూడగానే మాకు అదే విధమైన భావన కలుగుతుందంటారు పోస్టాఫీస్‌లో పనిచేసే జ్యోతి అనే అధికారిణి... బళ్లారికి వెళ్తే ఈ పోస్టాఫీస్‌ను చూస్తారు కదూ!