తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్రాసు హైకోర్టులో కిరణ్​బేడీకి చుక్కెదురు

పుదుచ్చేరి ప్రభుత్వ రోజువారీ పాలనా కార్యకలాపాల్లో లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీ జోక్యం చేసుకోరాదని మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. లెఫ్టినెంట్​ గవర్నర్ అధికారాల విషయంలో జాతీయ రాజధాని దిల్లీకి, పుదుచ్చేరికి మధ్య వ్యత్యాసం ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉటంకించింది.

మద్రాసు హైకోర్టులో కిరణ్​బేడీకి చుక్కెదురు

By

Published : Apr 30, 2019, 6:05 PM IST

Updated : Apr 30, 2019, 7:00 PM IST

మద్రాసు హైకోర్టులో కిరణ్​బేడీకి చుక్కెదురు

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీకి మద్రాస్​ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలచే ఎన్నికైన పుదుచ్చేరి ప్రభుత్వ రోజువారీ పాలనా కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం లెఫ్టినెంట్​ గవర్నర్​కు లేదని న్యాయస్థానం​ స్పష్టం చేసింది.

"ప్రభుత్వ రోజువారీ పాలనా కార్యకలాపాల్లో లెఫ్టినెంట్​ గవర్నర్​ జోక్యం చేసుకోకూడదు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు కార్యదర్శులు, ఇతర అధికారులు కట్టుబడి ఉండాలి." --మద్రాసు హైకోర్టు తీర్పు

దిల్లీ వేరు..పుదుచ్చేరి వేరు

దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ మధ్య జరిగిన వివాదంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించింది మద్రాసు హైకోర్టు. దిల్లీ ప్రభుత్వంపై విధించిన ఆంక్షలు... పుదుచ్చేరి ప్రభుత్వానికి వర్తించవని తేల్చి చెప్పింది. జాతీయ రాజధాని దిల్లీకి, పుదుచ్చేరికి మధ్య వ్యత్యాసం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొందని తెలిపింది.

పుదుచ్చేరి రాష్ట్రం కానప్పటికీ, ఒక రాష్ట్ర శాసనసభకు ఉన్న అన్ని అధికారాలు పుదుచ్చేరి శాసనసభ కలిగి ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.

బేడీ జోక్యం సహించబోం

ప్రభుత్వ రోజువారీ పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీ జోక్యాన్ని పుదుచ్చేరిలోని కాంగ్రెస్ కాంగ్రెస్​ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఈ విషయంపై మద్రాసు హైకోర్టులో పిటిషన్​ వేశారు. కిరణ్ బేడీ పుదుచ్చేరిలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే లెఫ్టినెంట్​ గవర్నర్​ అధికారాలను పెంచుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ 2017 జనవరి, జూన్​ నెలల్లో జారీ చేసిన రెండు ఉత్తర్వులను సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై జస్టిస్​ ఆర్​.మహదేవన్​ విచారణ చేపట్టి నేడు తీర్పు వెలువరించారు.

ప్రజాస్వామ్య విజయం

మద్రాసు హైకోర్టు తీర్పుపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి స్పందించారు. ఉన్నత న్యాయస్థానం తీర్పు చరిత్రాత్మకమని, ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. కాగా తీర్పును పరిశీలిస్తున్నామని లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీ తెలిపారు.

కిరణ్​బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారాయణ స్వామితో విభేదాలు కొనసాగుతున్నాయి. కిరణ్​ బేడీకి వ్యతిరేకంగా సీఎం నారాయణ స్వామి ధర్నాలు కూడా చేశారు.

ఇదీ చూడండి: మోదీ నామినేషన్​ రద్దు చేయండి: టీఎంసీ

Last Updated : Apr 30, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details