ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే 'నో షేవ్ నవంబర్' ఉద్యమానికి భారత్‌లోనూ మంచి ప్రచారం లభిస్తోంది. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు సేకరించే.. ఈ వినూత్న ప్రయత్నాన్ని కేరళ బియర్డ్ సొసైటీ అవలంబిస్తోంది.
ఈ 'నో షేవ్ నవంబర్' ఉద్యమంలో భాగంగా కేరళ కన్నూర్ జిల్లాలోని ఓ గడ్డం గ్యాంగ్... సామాజిక సేవ చేసేందుకు పూనుకుంది. యువకులందరూ క్షవరం, గడ్డం చేసుకోకుండా మిగిల్చిన డబ్బును సేకరించి పలు రకాల సామాజిక అవసరాల కోసం విరాళంగా ఇస్తున్నారు. దాదాపు రూ. 4 లక్షలు విరాళంగా సేకరించడం విశేషం. ఇలా చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ నిధుల్ని వైద్య సహాయం, పేదలకు గృహ నిర్మాణం, ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలు, వైద్య శిబిరాలను నిర్వహించడం వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.