తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనా-పాక్ సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉండాలి' - ఆర్మీ డే 2020

సరిహద్దులతో పాటు కశ్మీర్​ లోయలో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు అప్రమత్తంగా ఉండాలని సైన్యాధిపతి ఎంఎం నరవణే ఉద్బోధ చేశారు. ఎలాంటి అవసరం వచ్చిన తక్షణ కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

DEF-ARMYCHIEF
DEF-ARMYCHIEF

By

Published : Jan 15, 2020, 4:56 AM IST

చైనా, పాకిస్థాన్​ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సైన్యాధిపతి జనరల్​ ఎంఎం నరవణే సూచించారు. కశ్మీర్​ లోయలో ఉన్న సైనికులూ జాగ్రత్తగా ఉండాలని ఉద్బోధ చేశారు. ఎలాంటి సమయంలోనైనా ఏ అవసరమైనా రావచ్చని, తక్షణ కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఆర్మీ డే సందర్భంగా 13 లక్షల మంది సైనికులను ఉద్దేశించి మాట్లాడారు నరవణే.

"దేశంలో అత్యంత విలువైన సంస్థల్లో సైన్యం ఒకటి. విలువలు, నైతికత కాపాడుకుంటూనే దేశ పౌరులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.

ఉత్తర సరిహద్దుల్లో అన్ని చక్కబెట్టుకుంటూనే పశ్చిమాన ఉన్న విరోధికి సంబంధించి కార్యాచరణకు మీరు సిద్ధంగా ఉంటారన్న విషయంలో సందేహం అక్కర్లేదు. అందరూ చురుకుగా ఉండాలి."

-జనరల్​ ఎంఎం నరవణే, ఆర్మీ చీఫ్

ఇదీ చూడండి: 'నిత్యావసరాల ధరలపై మౌనమేల మోదీ?'

ABOUT THE AUTHOR

...view details