తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెప్పుల ద్వారా కూడా కరోనా- తస్మాత్​ జాగ్రత్త! - Karnataka experts says about Corona

ప్రపంచ మానవాళికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. చెప్పుల ద్వారా కూడా వైరస్​ వ్యాప్తి చెందుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లొచ్చాక.. వెంటనే వాటిని శానిటైజ్​ చేయాలని సూచిస్తున్నారు.

Corona Can spread through your footwears also
చెప్పుల ద్వారా కూడా కరోనా.. తస్మాత్​ జాగ్తత్త!

By

Published : Jun 10, 2020, 3:53 PM IST

కొద్దిరోజులుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా మహమ్మారి విషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెప్పుల ద్వారా కూడా కొవిడ్​-19 సోకే ప్రమాదముందని కర్ణాటక పరిశోధకులు చేసిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

శానిటైజేషన్ తప్పనిసరి..

కరోనా రోగులు తిరిగిన ప్రదేశాల్లో నడవడం ద్వారా వైరస్​ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మి ద్వారా మహమ్మారి వేగంగా సంక్రమిస్తుందని తెలిపారు. ఇందుకోసం బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా చెప్పులను ధరించాలన్న వైద్యులు.. రోడ్లపై నడిచేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇంటికి రాగానే చెప్పులను శానిటైజ్​ చేసుకోవాలని సూచిస్తున్నారు.

పాదరక్షలు శానిటైజ్ చేసుకునేందుకు బెంగళూరు 'ట్రస్ట్ ఆఫ్​ ఎన్విరాన్​మెంట్​' ఇప్పటికే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రసాయనాలు కలిసిన నీటిలో చెప్పులు ఉంచితే... వాటిపై ఉన్న క్రిములు చనిపోతాయని చెప్పారు ట్రస్ట్ ప్రతినిధి శ్రీధర్.

చెప్పుల శానిటైజేషన్​ ఇలా...

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో పాన్​, గూట్కాలు ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చదవండి:భారత్​లో యాక్టివ్​ కేసుల కంటే రికవరీనే ఎక్కువ

ABOUT THE AUTHOR

...view details