కరోనా నేపథ్యంలో న్యాయవాద పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ.. ఫిజికల్ ఎగ్జామినేషన్స్ నిర్వహణకు అనుమతించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ). విశ్వవిద్యాలయాలు పునఃప్రారంభమయ్యాక భౌతిక పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
అయితే.. ఈ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థల నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్ఓసీ)తో జరగాల్సి ఉంటుందని వెల్లడించింది బీసీఐ.
ఆయా విశ్వవిద్యాలయాలను.. బీసీఐ కౌన్సిల్ అధికారులతో పరిశీలించిన అనంతరం.. సోమవారం నుంచి భౌతికంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఇందుకోసం విద్యార్థులకు ఎలాంటి జరిమానాలు విధించకూడదని, ఎవరిపైనా పక్షపాత వైఖరి ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరుకాలేని అభ్యర్థులు.. విశ్వవిద్యాలయం లేదా న్యాయ విద్యా కేంద్రాలు పునఃప్రారంభమయ్యాక నెలలోపు మళ్లీ రాసుకోవచ్చని పేర్కొంది.