డాక్టర్ రాజారాం త్రిపాఠి.. హెర్బల్ ఉత్పత్తుల సాగులో అందెవేసిన చెయ్యి. వినూత్న పద్ధతుల్లో తెలుపు ముల్లీ, మిరియాలను పండిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రకమైన సాగు వల్ల రైతు జీవితమే మారుతుందని, ఇందుకు ప్రభుత్వ సాయం అందితే మరిన్ని ఫలితాలు ఉంటాయంటారు త్రిపాఠి.
'ఏదీ అసాధ్యం కాదు'
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నివాసం ఉండే త్రిపాఠి.. వ్యవసాయం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. మొదటగా తెలుపు ముల్లీని సాగు చేశారు. అనంతరం మిరియాల పంట వేశారు. సాధారణంగా తీరప్రాంతాలు, కేరళలోనే మిరియాల సాగు కనిపిస్తుంది. ఇప్పుడు బస్తర్‌ను కూడా అందుకు వేదిక చేశారు.
"నాలుగేళ్ల క్రితం మిరియాల పంట వేయాలనుకున్నాం. ఎందుకంటే ఎక్కువ లాభాలిచ్చే కొత్త రకం సాగు చేయాలనుకున్నాం. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి తీరప్రాంతాల్లోనే అవి పండుతాయన్నారు. బస్తర్‌లో అసాధ్యమన్నారు. కానీ మేం ప్రారంభించాం. మీరు ఇప్పుడు చూడొచ్చు.. మీరున్న తోటంతా మిరియాల పంట విస్తరించింది. ఇంకో విషమేమిటంటే దేశంలో మొదటి ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసాయ క్షేత్రం ఇదే."
-డాక్టర్ రాజారాం త్రిపాఠి, రైతు, బస్తర్