దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపిలేని భారీ వానలతో మహా నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో 375.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2005 వరదల అనంతరం ముంబయిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే.
ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్ రిపీట్! - వర్షపాతం
ముంబయిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో 375.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2005 ముంబయి వరదల అనంతరం ఒక్కరోజులో ఈ స్థాయి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి.
ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్ రిపీట్!
2005 జులై 26 నాటి వానను మినహాయిస్తే... ముంబయి చరిత్రలో 1974 జులై 5న కురిసిన వర్షమే అతిపెద్దది. ఆ రోజు 375.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 45ఏళ్ల తర్వాత మళ్లీ కచ్చితంగా అంతే స్థాయిలో వర్షం కురవడం విశేషం.
ఇదీ చూడండి:- పిల్లల ఆసుపత్రిలో 'స్పైడర్‌మ్యాన్' సందడి