తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏప్రిల్​లో రామమందిర నిర్మాణం.. ముస్లిం కక్షిదారుల అసంతృప్తి - ఏప్రిల్​లో రామమందిర నిర్మాణం.. ముస్లిం కక్షిదారుల అసంతృప్తి

అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ఈ ఏప్రిల్​లో మొదలుకానున్నాయి. రామనవమి లేదా అక్షయ తృతీయ సందర్భంగా గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు' సభ్యులు స్పష్టం చేశారు. మరోవైపు మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమిపై ముస్లిం తరఫు పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

barbi Mosque site too far from city centre: Muslim litigants of Ayodhya case; Ram temple work to begin in April this year says Trustee
ఏప్రిల్​లో రామమందిర నిర్మాణం.. ముస్లిం కక్షిదారుల అసంతృప్తి

By

Published : Feb 6, 2020, 8:09 PM IST

Updated : Feb 29, 2020, 10:51 AM IST

15 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర ధర్మనిధి 'శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​'ను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే.. అయోధ్యలో రామమందిర నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ఏప్రిల్​లో మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. రామనవమి పర్వదినం(ఏప్రిల్​ 2) లేదా అక్షయ తృతీయ(ఏప్రిల్​ 26) రోజున ఆలయ పనులకు శంకుస్థాపన జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది​.

అయితే ట్రస్టు తొలి సమావేశంలో కచ్చితమైన తేదీని ప్రకటిస్తామని తెలిపారు ట్రస్ట్​ సభ్యులు స్వామి దేవగిరి మహారాజ్​. మరో రెండేళ్లల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ముస్లిం కక్షిదారుల అసంతృప్తి

మరోవైపు మసీదు నిర్మాణానికి కేటాయించిన ఐదెకరాల స్థలంపై ముస్లిం కక్షిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్నీపుర్​ గ్రామం నగర కేంద్రానికి చాలా దూరంలో ఉందని వెల్లడించారు.

ఇదీ చదవండి:అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​

బుధవారమే కేటాయింపు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సున్నీఫక్ఫ్​ బోర్టుకు అందించే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమికి ఉత్తరప్రదేశ్​ కేబినెట్​ బుధవారమే ఆమోద ముద్రవేసింది. అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపుర్​ అనే గ్రామంలో.. మసీదు నిర్మించుకునేందుకు ఐదెకరాల భూమిని కేటాయించింది.

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

Last Updated : Feb 29, 2020, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details