చిన్న చిన్న కారణాలతోనే చెట్లను ఇష్టమొచ్చినట్టు నరికివేస్తున్న కాలంలో.. ఓ వ్యక్తి వృక్షంపై ప్రేమతో దాని చుట్టే ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి మధ్యలో ఉన్న ఆ మర్రి చెట్టు కొమ్మలు గోడలపై అంతటా వ్యాపించాయి. కొమ్మలను కూడా నరకకుండానే ఆ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించుకొని పర్యావరణంపై ప్రేమను చాటారు ఆ వ్యక్తి. మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో ఉందీ మర్రిచెట్టు గృహం. ఇంటిని నిర్మించింది మోతీలాల్ కేశర్వాణి.
వృక్షాలను ప్రాణంగా భావించే మోతీలాల్ కేశర్వాణి ఎంతో ప్రేమగా ఈ ఇల్లును కట్టారు. ఆయన చనిపోయి కొద్దికాలమైంది. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ ఇంటిని సర్వస్వంగా భావిస్తున్నారు.