దేశం పేరు ప్రతిష్ఠలు పెంచిన క్రీడాకారిణి.. పరుగుల రాణి హిమాదాస్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఏకంగా.. బెంగళూరులో ఓ పులి పిల్లకే ఆమె పేరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రం అసోంకు చెందిన ఆ క్రీడాకారిణి గుర్తింపును మరింత పెంచేలా చేసిందీ ఘటన.
బెంగళూరు బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లోని 6 నెలల బుజ్జిపులికి హిమాదాస్గా నామకరణం చేశారు. చిరుతలా పరుగెత్తి.. ఒకే నెలలో దేశానికి 5 స్వర్ణాలు తెచ్చిపెట్టింది హిమాదాస్. జులై 29న ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పార్క్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్గా నామకరణం! - ASSAM
సాహసాలు చేసేవారిని పులి బిడ్డరా.. అని పొగిడే ఆనవాయితీకి స్వస్తి పలికింది నయా పరుగుల రాణి హిమాదాస్. ఎందుకంటే.. ఇప్పుడు పులిపిల్లలకే ఆమె పేరు పెడుతున్నారు మరి. బెంగళూరులోని ఓ పార్కులో పులిపిల్లకు హిమా అని నామకరణం చేశారు.
పులిబిడ్డకు బారసాల.. హిమదాస్గా నామకరణం!
ఇదీ చూడండి:ఈ బుడ్డోడు.. ఫుట్‌బాల్ ఆటలో గట్టోడు..!