భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా... కుల, మత బేధాలు లేకుండా అందరూ ఆప్యాయంగా పలకరించుకునే దేశంగా భారత్ ఏనాడో పేరొందింది. కానీ, ఇంతటి ఘనకీర్తి ఉన్నా అసోంలోని ఓ గ్రామంలో మూర్ఖత్వం తాండవిస్తోంది. ఆ ఊరిలో మతం మారిన కుటుంబాలను వెలివేయడమే కాదు. అంటరాని వారిలా చూస్తూ చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
అసోం-భూటాన్ సరిహద్దు రాజాగఢ్ ప్రాంతంలోని ఉదల్గురి జిల్లాలో వింత సంస్కృతిని అవలంబిస్తున్నారు. మతం మారినందుకు ఐదు కుటుంబాలను గ్రామస్థులు బహిష్కరించారు. ఎవరైనా వారితో మాట్లాడితే వారికి రూ. 30000/- జరిమానా విధిస్తారు. వారితో మానవ మూత్రం తాగిస్తారు. కేవలం వారు మతాన్ని మార్చుకున్నారని, వారికి నచ్చిన ప్రార్థనలు చేయటమే నేరంగా పరిగణించి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు.
వారితో ఊళ్లో వాళ్లు మాట్లాడినా, వారు ఊళ్లో వాళ్లెవరి దగ్గరికైనా వచ్చినా జరిమానా కట్టాలి.