కరోనా నుంచి వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా రైతులకు రాయితీ రుణాలను అందించడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ సంతృప్తికరంగా సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వ్యవసాయానికి రూ.1.02 లక్షల కోట్ల రుణాలు - వ్యవసాయ రుణాలు
కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ నెల 17 వరకు 1.02 లక్షల కోట్ల రూపాయలను రాయితీ రుణాల కింద అందించినట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్ సంతృప్తికరంగా సాగుతోందని తెలిపింది.
![వ్యవసాయానికి రూ.1.02 లక్షల కోట్ల రుణాలు Banks sanction over Rs 1 lakh crore concessional loans to KCC holders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8499122-587-8499122-1597974621343.jpg)
వ్యవసాయానికి రూ.1.02 లక్షల కోట్ల రుణాలు
అందులో భాగంగా ఈ నెల 17 నాటికి 1.22 కోట్ల కేసీసీలకు రూ. 1,02,065 కోట్లు రాయితీ రుణాల క్రింద మంజూరు చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Last Updated : Aug 21, 2020, 9:03 AM IST