కర్ణాటక, బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వినూత్న చర్యలకు దిగి అబాసుపాలైంది. ఓ కరోనా కేసు నమోదైందని రెండు ఇళ్లకు స్టీల్ రేకులతో సీల్ వేసింది.
కరోనా సోకిందని తలుపులకు స్టీల్ రేకులతో సీల్! - BBMP sealed doors of 2 flats in steel sheets
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యావత్ దేశం చర్యలు తీసుకుంటోంది. కానీ, బెంగళూరు నగరపాలక సంస్థ అధికారులు తీసుకున్నంత కఠిన చర్యలు బహుశా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదేమో! భవనంలో ఓ వ్యక్తికి కరోనా సోకిందని.. రెండు ఇళ్లకు స్టీల్ రేకులతో సీల్ వేసి మరీ వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. బాధిత కుటుంబం సామాజిక మాధ్యమాల్లో ఈ సంగతి పంచుకున్నాక, తలుపులకు బిగించిన ఉక్కు కవచాన్ని తీసేశారు.
కరోనా సోకిందని తలుపులకు స్టీల్ రేకులతో సీల్!
బెంగళూరులోని దొమ్మలూర్ ప్రాంతంలో ఓ భవనంలో కరోనా కేసు నమోదైంది. దీంతో అధికారులు ఆ భవనంలోని రెండు కుటుంబాలను హోమ్ క్వారంటైన్లో ఉండమని హెచ్చరించారు. అంతటితో ఆగక, వారు బయటికి రాకుండా ఉండేలా తలుపులను ఉక్కు రేకులతో మూసేశారు. ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు, వృద్ధ దంపతులు ఉన్న ఇంటిని ఇలా బంధించడమేంటంటూ ట్వీట్ చేసింది ఆ మహిళ. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఉక్కు సీల్‌ను తీసేశారు.
ఇదీ చదవండి: ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం