తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారుపార్కులో వర్ణమాల - బెంగళూరు

బెంగళూరులోని కారుపార్కు సమీపంలో ఏర్పాటు చేసిన కన్నడ వర్ణమాల కన్నడిగులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాత వాహనాల భాగాలతో రూపొందించిన కన్నడ అక్షరాలు ఎల్​డీఈ వెలుగులతో మెరిసిపోతున్నాయి.

కారు పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన కన్నడ వర్ణమాల

By

Published : Mar 6, 2019, 4:20 PM IST

బెంగళూరు... గార్డెన్​ సిటీగా ప్రాచుర్యం పొందింది. ప్రత్యేక థీమ్​లతో ఏర్పాటు చేస్తున్న మొక్కలు, చెట్లతో నగరంలోని పార్కులు ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. నగరవాసులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

బటర్​ఫ్లై పార్క్, రాక్ గార్డెన్​, కారు​ పార్కులు ఈ కోవలోకి చెందినవే. వీటిలో నగరవాసులను ప్రస్తుతం అమితంగా ఆకట్టుకుంటున్నది కారుపార్కు. బెంగళూరులోని దేవరచిక్కనహళ్లిలో ఉందీ పార్కు.

కారు పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన కన్నడ వర్ణమాల

కారు పార్కు ప్రత్యేకతలివే

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పాతకాలపు కార్లను ప్రదర్శిస్తున్నారు ఈ కారుపార్కులో. అలాగే వివిధ జాతులకు చెందిన పక్షులు, ఇక్కడి ఓపెన్​ఎయిర్​ ఆడిటోరియం బెంగళూరు ప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

వాహన భాగాలతో వెలుగుల వర్ణమాల

దేవరచిక్కనహళ్లిలోని కారుపార్కు సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్​ సిటీ ఆర్టీవో ఫుట్​పాత్​... అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. పాత లారీలు, బైకులు, కార్ల బేరింగులు, చైన్లు, ఎల్​ఈడీ లైట్లతో రూపొందించిన కన్నడ వర్ణమాలను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఎల్​ఈడీ లైట్లతో కన్నడ అక్షరాలు వెలుగులను విరజిమ్ముతున్నాయి. వీటిని చూసిన కన్నడవాసులు... గర్వంగా ఉందని చెబుతున్నారు. ఈ విభిన్న ఆలోచన అందరికీ కన్నడ అక్షరమాలను పరిచయం చేసేలా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details