సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్మగ్లర్‌ను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) కాల్చి చంపాయి. మాల్దా జిల్లాలోని గోపాల్‌పుర్ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
ఫెన్సిడైల్ మందును స్మగ్లర్ అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. అతని వద్ద నుంచి 75 సీసాల దగ్గు మందును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.