తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విలువల చంద్రుడు... విద్యాసాగరుడు...!

"బంగాల్​ ఆత్మగౌరవం"... సార్వత్రిక సమరం తుది దశకు ముందు వినిపించిన మాట. ఇందుకు కారణం... ఈనెల 14న అమిత్​షా రోడ్​షో సందర్భంగా జరిగిన ఘర్షణలు. ఆ రోజు... కోల్​కతాలోని విద్యాసాగర్​ కళాశాలలోని ఓ​ విగ్రహం ధ్వంసమైంది. కొందరు దుండగులు చేసిన పని... పెను రాజకీయ దుమారానికి కారణమైంది. ఇంతటి వివాదానికి కారణమైన ఆ విగ్రహం ఎవరిది? బంగాల్​ ఆత్మగౌరవానికి, ఆ విగ్రహానికి సంబంధం ఏంటి?

By

Published : May 19, 2019, 10:30 AM IST

విలువల చంద్రుడు... విద్యాసాగరుడు...!

"సొంత ఆసక్తుల కంటే ముందు జాతీయ, సాంఘిక ప్రయోజనాలు నెరవేర్చడమే ప్రతి పౌరుడి ప్రథమ బాధ్యత."

- ఈశ్వర చంద్ర విద్యాసాగర్​, ప్రముఖ బంగాలీ సంఘ సంస్కర్త

ఈ అమృతవాక్కులు ప్రముఖ బంగాలీ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ మనఃఫలకం నుంచి ఉదయించినవి.

బంగాల్​ పునరుజ్జీవనోద్యమ ఆద్యుల్లో ఒకరు ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఓ గొప్ప మానవతావాది, మేధావి, సంఘ సంస్కర్త. బంగాల్​లోని అన్ని వర్గాలవారికీ అత్యంత గౌరవనీయుడు.

ధ్రువతార...

అందరికీ ఆరాధ్యుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేద బంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో 1820 సెప్టెంబర్​ 26న జన్మించారు. తల్లి భాగబతి దేవి గృహిణి. తండ్రి ఠాకూర్​దాస్ బందోపాధ్యాయ గుమస్తాగా పనిచేసేవారు. విద్యాసాగరుడు చిన్నతనంలో కఠిన పేదరికాన్ని అనుభవించారు. ఇది ఆయనలో పేదల పట్ల ఔదార్యాన్ని పెంచింది.

స్వగ్రామంలోనే ప్రాథమిక చదువు పూర్తిచేసిన విద్యాసాగర్​... కోల్​కతాలో ఆంగ్ల విద్యాభ్యాసం చేశారు. తరువాత తండ్రి కోరిక మేరకు 1829లో సంస్కృత కళాశాలలో చేరారు. వేద, వేదాంత, అలంకార శాస్త్రాలతోపాటు, భారతీయ తత్వశాస్త్రాల్లోనూ నిష్ణాతులయ్యారు.

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1859లో 'మెట్రోపాలిటన్​ ఇన్​స్టిట్యూట్​'ను స్థాపించారు. ఆంగ్ల మాధ్యమంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందించే ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పారు. 1917లో 'విద్యాసాగర్​ కళాశాల'గా పేరు మార్చారు. ఈ కళాశాలలోని విగ్రహాన్నే ఇటీవల దుండగులు ధ్వంసం చేశారు.

సంఘ సంస్కరణ...

సాధారణ జీవనానికి, ఉన్నతమైన ఆలోచనలకు ఆయన ఉదాహరణ. విద్యాసాగర్ విస్తృత అధ్యయనం మాత్రమే కాకుండా, సామాజిక, విద్యా సంస్కరణలకు పాటుపడ్డారు. పేదలకు, అణిచివేతకు గురైన వారికి ప్రేమతో చేయూత అందించారు.

కోల్​కతాలోని సంప్రదాయ సంస్కృత కళాశాలల్లో వెనుకబడిన కులాల విద్యార్థులకూ ప్రవేశం కల్పించారు విద్యాసాగర్​.

విద్యాసాగర్ ఎన్నో గ్రంథాలు రాశారు. సంస్కృతం ప్రభావం నుంచి బంగాలీ భాషను విముక్తం చేశారు. రాజా రామ్మెహన్​రాయ్ సంస్కరణ విధానాలను ఆరాధించారు. 'మహిళా విద్య' కోసం విశేష కృషి చేశారు. అందుకోసం సంప్రదాయ సమాజంపై యుద్ధమే చేశారు. మహిళలకు ఆధునిక విద్య అందించడం కోసం కోల్​కతాలో 35 బాలికల పాఠశాలలను ప్రారంభించారు.

మహిళల కోసం సంప్రదాయ సంఘంతో పోరాటం

ఈశ్వర చంద్రుడు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. సంప్రదాయ శాస్త్రాల ప్రకారం వితంతు వివాహాలు జరిపించవచ్చని నిరూపించారు. ఆయన అవిరళ కృషితోనే హిందూ పునర్వివాహ చట్టం 1956 జులైలో అమలులోకి వచ్చింది.

దేశానికి ఎంతో సేవచేసిన విద్యాసాగర్... 1891లో తనువు చాలించారు.

విద్యాసాగరుడి గురించి మహాత్ముడు...

"ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విజ్ఞానఖని మాత్రమే కాదు. ఆయన ఔదార్యం, కరుణ, ధర్మాల మహాసముద్రం. గత శతాబ్ద కాలంలో రాజా రామ్మెహన్​రాయ్​తో ప్రారంభమైన బంగాల్​ గొప్ప సంస్కర్తల్లో విద్యాసాగర్ ఒకరు."

-మహాత్మా గాంధీ


ఇదీ చూడండి: కేన్స్​: అదిరిపోయే గౌనుతో ప్రియాంక చిరునవ్వు

ABOUT THE AUTHOR

...view details