తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 11:35 AM IST

ETV Bharat / bharat

పాలు పితికే యంత్రంతో కరెంట్ షాక్- 11 ఆవులు మృతి

గుజరాత్​లో విద్యుదాఘాతంతో 11 గోవులు మృతి చెందాయి. పాలుపితికే యంత్రంలో షార్ట్​ సర్క్యూట్​ వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Banaskantha: In Kotda Bhakhar village, a milking machine was electrocuted, killing 11 animals
విద్యుదాఘాతంతో 11 గోవులు మృతి

గుజరాత్​ బనాస్​కాంఠా జిల్లా దంతివాడాలో దారుణం జరిగింది. పాలుపితికే యంత్రం వల్ల కరెంట్​ షాక్​ తగిలి 11 ఆవులు మరణించాయి. సోమవారం ఉదయం యంత్రంతో పాలు పితుకుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

దీంతో ఆవులపైనే ఆధారపడి జీవిస్తున్న రైతు.. ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. పాల యంత్రం తయారు చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్​ చేశాడు.

సమాచారం అందుకున్న బనాస్​ డైయిరీ అధికారులు సహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం

ABOUT THE AUTHOR

...view details