దిల్లీ గగనతలంలో ఆగస్టు 15 వరకు మానవరహిత విమానాలు, పారాగ్లైడర్లు, ఎయిర్ బెలూన్లు ఎగరడాన్ని పోలీసులు నిషేధించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ.
దిల్లీలో మానవ రహిత విమానాలపై నిషేధం - దిల్లీలో డ్రోన్లపై నిషేధం
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 వరకు దిల్లీ గగనతలంలో మానవ రహిత విమానాలు, పారాగ్లైడర్లు, బెలూన్లు ఎగరడాన్ని నిషేధించారు.
దిల్లీ
వేడుకల సమయంలో కొందరు సంఘ విద్రోహులు గగన మార్గం నుంచి దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు దిల్లీ పోలీసులు.