జూన్ 1 నుంచి లాక్డౌన్ 5.0 అమల్లోకి రానుంది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లను పునరుద్ధరిస్తూ ఫేస్-1 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. అయితే.. మెట్రో రైల్ సేవలు, థియేటర్లు సహా మరిన్ని వాటిపై ఆంక్షలు కొనసాగించింది. నూతన మార్గదర్శకాల్లోని ఫేజ్-3లో వీటిని పేర్కొంది.
థియేటర్లు తెరవడంపై కేంద్రం ఏం చెప్పిందంటే..! - లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలు
థియేటర్లు, జిమ్ సహా వినోద కార్యకలాపాల పునరుద్ధరణపై అస్పష్టత కొనసాగుతోంది. లాక్డౌన్ 5.0 మార్గదర్శకాల్లోనూ వీటిపై నిషేధం కొనసాగించింది కేంద్రం. పరిస్థితి ఆధారంగా వాటిని ప్రారంభించడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది.

థియెటర్లు ఇప్పట్లో తెరుచుకోవడం కష్టమే!
Last Updated : May 30, 2020, 10:06 PM IST