కరోనా వైరస్‌తో పోరాటానికి సమతుల్యమైన వ్యూహాలన్ని రూపొందించి.. వాటిని అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఈ వైరస్ గ్రామీణ భారతంలో వ్యాప్తి చెందకుండా చేయడమే అతిపెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. కరోనాను భారత్ ఎదుర్కొంటున్న తీరుకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. వైరస్‌పై పోరులో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు మోదీ. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.
భౌతిక దూరం వంటి నిబంధనలు లెక్కచేయని సమయంలోనే వైరస్ తీవ్రతరమవుతోందని మోదీ తెలిపారు. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడంలో పేలవంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు క్లారిటీ వచ్చింది!
భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో కరోనా వ్యాపి విషయాలపై ప్రస్తుతం స్పష్టమైన అవగాహన వచ్చిందని మోదీ వెల్లడించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఏం చేయాలో గత కొద్ది వారాల్లో అధికార యంత్రాంగానికీ అర్థమైందని వ్యాఖ్యానించారు.
"ఇకపై మరింత స్పష్టమైన లక్ష్యాలతో, అప్రమత్తతతో కరోనాపై పోరును కొనసాగించాల్సిన అవసరముందని మనం అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడమే లక్ష్యంగా మనం ముందుకు సాగాలి. 'రెండు గజాల దూరం' నినాదంతో ప్రజలంతా విధిగా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూడాలి." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎకానమీ ఓకే.. కరోనాపైనే దృష్టి