బదాయూ సామూహిక అత్యాచార ఘటన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్)ను ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మొత్తం ముగ్గురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
జనవరి 3న బదాయూ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో 50ఏళ్ల మహిళా అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచారం జరిగింది. దేవుడి దర్శనం కోసం ఓ ఆలయానికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.