అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల సాధారణంగా తల్లి ఏనుగు వెనుక పరిగెడుతుంది. కానీ, మైసూరు జూలో ఉన్న ఓ ఏనుగు పిల్ల... సోము అనే వ్యక్తినే అనుసరిస్తోంది.
అపూర్వ స్నేహం: నిమిషమైనా విడిచి ఉండలేని వేదవతి - వేదవతి ఏనుగు
ప్రేమాభిమనాలకు ఎలాంటి భేదం లేదని మరోసారి నిరూపితమైంది. తనను చేరదీసి, సంరక్షిస్తున్న వ్యక్తిని ఓ ఏనుగు పిల్ల మనసారా అభిమానిస్తోంది. అతని వెంటే తిరుగుతూ, స్నేహంగా ఉంటోంది. అతను లేకపోతే భోజనం కూడా చేయడంలేదు. మరి ఆ కథేంటో మీరూ చూడండి.
మైసూరు జంతు ప్రదర్శనశాలలో ఉండే సోము... అనాథ ఏనుగుల బాగోగులను చూసుకుంటూ ఉంటాడు. ఇటీవల కొల్లెగల అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన ఏనుగు పిల్ల సంరక్షణను గత కొన్ని రోజులుగా సోమునే చూసుకుంటున్నాడు. ఏనుగు పిల్లకు వేదవతి అనే పేరును కూడా పెట్టాడు. రోజు తనకు తిండి పెడుతూ... తనతోనే ఉండే సోముతో వేదవతి చాలా స్నేహంగా ఉంటోంది. సోము ఎక్కడికి వెళ్లినా అతడినే అనుసరిస్తూ ప్రేమాభిమానాలు కురిపిస్తోంది. సోము లేకపోతే వేదవతి భోజనం కూడా ముట్టదని జూ అధికారులు చెబుతున్నారు. సోమును కాకుండా మరెవర్నీ తన దగ్గరికి కూడా రానీయదని తెలిపారు.
ఇదీ చూడండి:తొలి అణ్వస్త్ర పరీక్ష 'ట్రినిటీ'కి 75 ఏళ్లు