బంగాల్ అసాన్సోల్లో పోలింగ్ హింసాత్మకం - అసాన్ సోల్
బంగాల్ అసాన్సోల్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద హింస చెలరేగింది. తమ పార్టీ ఏజెంట్‌కు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలతో భాజపా అభ్యర్థి బాబుల్ సుప్రియోతో తృణమూల్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది.
కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో పోటీ చేస్తున్న అసాన్సోల్ నియోజకవర్గంలో తృణమూల్ కార్యకర్తలకు, భాజపా శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. ఓ బుూత్లోని తమ పార్టీ ఏజెంట్‌కు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలతో బాబుల్ సుప్రియోతో తృణమూల్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురిపై లాఠీఛార్జి చేశారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు బాబుల్ సుప్రియో వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రంలో భాజపా ఏజెంట్లను అనుమతించకూడదని డిమాండ్ చేశారు.