తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు ఉమాభారతి

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి. ఈ కేసులో 19 వ నిందితురాలిగా ఉన్న ఆమె న్యాయస్థానం ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

By

Published : Jul 2, 2020, 1:03 PM IST

Babri trial: Uma Bharti appears before CBI court
బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ఎదుట ఉమాభారతి

1992 నాటి బా‌బ్రీ మసీదు కూల్చివేత కేసులో కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నాయకురాలు ఉమా భారతి.. సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. 27 ఏళ్ల కిందటి కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు సీఆర్​పీసీ సెక్షన్ 313 కింద 32 మంది నిందితుల వాంగ్మూలాలను నమోదు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ కేసులో 19వ నిందితురాలిగా ఉన్న ఉమాభారతి వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఇదే కేసుకు సంబంధించి భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, ఎంఎం జోషి, కల్యాణ్ సింగ్‌ సహా మరో 13 మందిని విచారించాల్సి ఉంది.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details