తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాబ్రీ తీర్పు'తో కమలదళానికి కొత్త ఉత్సాహం - బిహార్​ ఎన్నికలు

రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలపై ప్రభావం చూపిస్తోన్న.. రామజన్మభూమి వివాదం సమసిపోయినట్లే కనిపిస్తోంది. బాబ్రీ ఘటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించిన తాజా తీర్పు.. భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న భాజపా సీనియర్​ నేతలను నిర్దోషులుగా ప్రకటించడం.. బిహార్​ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కమలం శ్రేణుల్లో నయా జోష్​ నింపుతోంది.

erdict boost to BJP
'బాబ్రీ తీర్పు' కమలదళానికి కొత్త ఉత్సాహం

By

Published : Sep 30, 2020, 8:05 PM IST

Updated : Sep 30, 2020, 10:33 PM IST

28 ఏళ్లుగా నడుస్తోన్న బాబ్రీ కేసులో తీర్పు వెలువడింది. భాజపా నేతలు సహా హిందుత్వ కార్యకర్తలను నిర్దోషులుగా ప్రకటిస్తూ... సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా అగ్ర నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ తీర్పుపై భాజపా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడటం.. భాజపాలో నయా జోష్​ తీసుకొచ్చింది. పార్టీ అగ్రనేతలపై ఏళ్లుగా ఉన్న ఈ ఆరోపణల నుంచి విముక్తి లభించినట్లయిందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ కేసులో మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని... ఈ నేతలు ముందునుంచి చేస్తున్న వాదనలను కోర్టు సమర్థించిందని కమలనాథులు చెబుతున్నారు.

బిహార్​ ఎన్నికలు సహా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్​సభ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా నేతలు నిర్దోషులుగా తేలటం కమలనాథులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది.పార్టీ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.

బాబ్రీ మసీదు కేసు రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా వివాదాస్పద అంశంగా ఉంది. చాలా సార్లు ఎన్నికలు దీని చుట్టూ తిరిగిన సందర్భాలున్నాయి.

నాడు భాజపా అగ్రనేత అడ్వాణీ చేపట్టిన రథయాత్రలో భాగంగా.. కరసేవకులు భారీ ఎత్తున బాబ్రీ మసీదు వద్దకు చేరుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారి.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటినుంచి రామ జన్మభూమి అంశాన్ని కీలకంగా ప్రస్తావించిన భాజపా.. ఆ క్రమంలోనే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది.

అనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్​ సహా అనేక పార్టీలు బాబ్రీ ఘటనలో భాజపాను వేలెత్తి చూపేవి. ఇప్పుడు పార్టీ నేతలకు క్లీన్​చిట్​ లభించిన నేపథ్యంలో భాజపాను ఇరుకున పెట్టేందుకు మరో అవకాశమే లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. ఈ తీర్పును నిజాయతీకి, న్యాయానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నాయి భాజపా శ్రేణులు.

ఇదీ చూడండి:'బాబ్రీ' కేసు: 28 ఏళ్లలో మలుపులెన్నో...

ఇదీ చూడండి:'బాబ్రీ' తీర్పుపై న్యాయ విభాగాన్ని సంప్రదిస్తాం: సీబీఐ

Last Updated : Sep 30, 2020, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details