బాబ్లీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది అలహాబాద్ హైకోర్టు. పిల్లో కొన్ని దోషాలను సవరించడానికి పిటిషనర్లు కొంత సమయం కావాలని కోరినందువల్ల జస్టిస్ రాకేష్ శ్రీవాస్తవతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
'బాబ్రీ తీర్పు సవాల్'పై విచారణ 2 వారాలకు వాయిదా - బాబ్రీ తీర్పుపై కేసును రెండు వారాలకు వాయిదా
బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది అలహాబాద్ హైకోర్టు. వ్యాజ్యంలో కొన్ని దోషాలను తొలగించడానికి పిటిషనర్లు కొంత సమయం కావాలని కోరగా.. కోర్టు ఈ మేరకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ను జనవరి 8న అయోధ్య వాసులైన మహమ్మద్ అహ్మద్, సయ్యద్ అఖ్లాఖ్లు దాఖలు చేశారు.
!['బాబ్రీ తీర్పు సవాల్'పై విచారణ 2 వారాలకు వాయిదా Babri case: HC adjourns for two weeks hearing on plea against acquittal of accused](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10225934-359-10225934-1610526500065.jpg)
బాబ్రీ తీర్పుపై కేసు విచారణ రెండు వారాలకు వాయిదా
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మంది నిందుతులను నిర్దోషులుగా తేల్చుతూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జనవరి 8న అయోధ్య వాసులు హాజీ మహమ్మద్ అహ్మద్, సయ్యద్ అఖ్లాఖ్లు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి :బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు
Last Updated : Jan 13, 2021, 2:38 PM IST