28 ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కేసుపై ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అడ్వాణీ, జోషి హర్షం...
వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించటంపై భాజపా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎల్కే అడ్వాణీ, జోషి.. కోర్టు తీర్పును స్వాగతించారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీబీఐ స్పందన...
బాబ్రీ కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును.. సవాల్ చేయాలని భావిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ అంశంలో న్యాయ విభాగాన్ని సంప్రదించిన అనంతరం.. నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది సీబీఐ.