తెలంగాణ

telangana

చలిపులి నుంచి కాపాడే బాబా రామ్​దేవ్ సూత్రాలు!

చలిపులి దేశంపై పంజా విసిరి.. మానవాళి ఆరోగ్యాలపై ప్రతాపం చూపుతోంది. చలిమంటలు వేసుకుని, ఉన్ని దుస్తులు ధరించినా లాభం లేకుండా పోయింది. చలి దెబ్బకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఆసుపత్రుల పాలవుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అంటే.. లక్షణంగా ఉందంటున్నారు యోగా గురు బాబా రామ్​దేవ్. మరి ఆ చిట్కాలేంటో చదివేయండీ...

By

Published : Jan 8, 2020, 6:02 AM IST

Published : Jan 8, 2020, 6:02 AM IST

Baba Ram Dev Principles To Rescue Them From The Cold!
చలిపులి నుంచి కాపాడే బాబా రామ్​దేవ్ సూత్రాలు!

చలి కారణంగా రక్తప్రసరణ తగ్గి.. బీపీ పెరుగుతుంది. ఈ కారణంగా గుండె జబ్బులు వస్తాయి. ఆస్తమా, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. ఇలాంటి సమయాల్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చలి పుట్టించే ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు అంటున్నారు యోగా గురువు బాబా రామ్​దేవ్​.

చిట్కాలివే...

⦁ శ్వాస సంబంధిత వ్యాధులున్నవారు 30 సొంటి కాయలు పొడి చేసుకుని ఉదయం సాయంత్రం ఒక్కో చెంచా తీసుకోవాలి. మూడు పూటలా కలబంద రసం తాగాలి. వీలైతే.. పాలల్లో శిలాజిత్, కాస్త పసుపు మరిగించి తాగాలి.

⦁ ఇక ఎవరికైతే దగ్గు, ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయో వారు పాలల్లో సాస్​రీ, గిలోయ్​ వేసి తాగితే.. చలి వల్ల కలిగే ఏ అనారోగ్యమూ దరిచేరదు. శరీరం వెచ్చబడి అంతగా చలి పెట్టదు.

⦁ ప్రాణాయామం చేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలిసిందే.

⦁ ఇంటి చిట్కాలు పాటించాలి. ఉత్తర భారతంలో నువ్వుల లడ్డూలు తినాలి. ఎండు ఖర్జూరాలు బాగా తినాలి.

⦁ చలి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి నువ్వుల నూనెతో మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మం లోపలికి చలి చొరబడలేదు.

⦁ సూర్య నమస్కారం, వ్యాయామం ఉపకరిస్తుంది. ప్రాణాయామం చేస్తే శరీరమంతా శక్తి ఉత్పత్తి అవుతుంది.

అనారోగ్యాన్ని జయించే శక్తి ఎక్కడో లేదు మన శరీరంలోనే ఉందంటారు బాబా.

చలిపులి నుంచి కాపాడే బాబా రామ్​దేవ్ సూత్రాలు!

"రక్తపోటు ఉన్నవారు అనులోమ, విలోమ, భ్రమరీ ప్రాణాయామం చేయాలి. గుండెజబ్బుతో బాధపడేవారు అర్జుణ కాయలు, దాల్చిన చెక్క పాలల్లో కలిపి తాగితే ఎలాంటి ఇబ్బందులు కలుగవు. కీళ్ల నొప్పులు ఉన్న వారు పాలు, పసుపుతో పాటు చంద్ర ప్రభావ్​ చాయ్​, యోగ్​రాజ్​ కుల్​కుల్​ పొడి, కలబంద రసం రోజుకు మూడు సార్లు తాగాలి. చలి నుంచి తప్పించుకోవాలంటే నాలాగా సామర్థ్యం ఉన్నవారు పరిగెత్తాలి. అలా చేస్తే చలికాలంలో కూడా చెమటలు పడతాయి."

-బాబా రామ్​దేవ్​

ఇదీ చూడండీ:నిర్భయ' దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details