తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాబా కా దాబా' విరాళాల పేరుతో మోసం!

'బాబా కా దాబా'కు ప్రాచుర్యం లభించడానికి కారణమైన గౌరవ్ వాసన్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ హోటల్ యజమాని కాంతా ప్రసాద్. తన హోటల్ పేరిట భారీగా విరాళాలు సేకరించి.. అందుకు సంబంధించిన వివరాలేవీ తనకు చెప్పలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Baba Ka Dhaba' owner accuses YouTuber of misappropriation of funds
భారీగా విరాళాలు సేకరించారు- నాకు మాత్రం ఇవ్వలేదు

By

Published : Nov 2, 2020, 8:58 AM IST

సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్​లోడ్ చేసి 'బాబా కా దాబా'కు ప్రాచుర్యం కల్పించిన గౌరవ్ వాసన్​పై ఆ హోటల్ యజమాని కాంతా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాతలకు తన సొంత ఫోన్ నెంబర్ ఇచ్చి డబ్బులు వసూలు చేశారని, అయితే ఆ సొమ్మును తనకు బదిలీ చేయలేదని ఆరోపించారు.

"తన సొంత బ్యాంకు ఖాతాలతో పాటు కుటుంబ సభ్యుల ఖాతా వివరాలు, ఫోన్​ నెంబర్లను మాత్రమే దాతలతో పంచుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆయన ఇలా చేశారు. బ్యాంకు ఖాతాలు, వాలెట్లు తదితర మార్గాల ద్వారా భారీగా విరాళాలు సేకరించారు. దీనికి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు."

-కాంతా ప్రసాద్, బాబా కా దాబా యజమాని

కాంతా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించినట్లు మాల్వీయ నగర్ పోలీసులు తెలిపారు. ఎఫ్​ఐఆర్ ఇంకా నమోదు చేయలేదని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

వీడియోతో వైరల్..

లాక్​డౌన్​తో తీవ్రంగా నష్టపోయిన వృద్ధ దంపతులను ఆదుకునేందుకు దిల్లీకి చెందిన గౌరవ్​ వాసన్​ అనే వ్యక్తి... ఓ వీడియో రూపొందించారు. వృద్ధుల పరిస్థితిని వివరించి వారికి సహాయం చేయాలని కోరుతూ.. వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేశారు. వీడియో ఒక్కసారిగా వైరల్​ అయ్యింది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​గా మారిపోయింది. దీంతో 'బాబా కా దాబా' హోటల్​కు విశేష ప్రాచుర్యం లభించింది.

ABOUT THE AUTHOR

...view details